లక్నో: ఒక మహిళకు పొరుగింటి కుటుంబంతో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. తాజా గొడవ సందర్భంగా పొరుగింటి వ్యక్తి నగ్నంగా మారి అసభ్యకరంగా ప్రవర్తించాడు. (Woman films neighbour) ఆ మహిళ దీనిని వీడియో రికార్డ్ చేసింది. ఆగ్రహించిన ఆ వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. రాజాజీపురం ప్రాంతంలో నివసిస్తున్న మహిళ, పొరుగింటి వారి మధ్య చాలా కాలంగా వివాదం జరుగుతున్నది. అక్టోబర్ 3న వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ సందర్భంగా పొరుగింటి వ్యక్తి తన బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు, ఆధారం కోసం నగ్నంగా ఉన్న అతడ్ని ఆ మహిళ వీడియో రికార్డ్ చేసింది.
కాగా, ఇది గమనించిన పొరుగింటి వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులు ఆ మహిళపై ఆగ్రహించారు. బలవంతంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారు. ఈ సందర్భంగా కిందకు నెట్టి తన ప్రైవేట్ భాగంపై ఆ వ్యక్తి తన్నినట్లు ఆ మహిళ ఆరోపించింది. జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన తన తండ్రిని కూడా వారు కొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు పొరుగింటి కుటుంబం దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మహిళ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు చేపడతామని, వారిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
Also Read:
Blast In Ayodhya | అయోధ్యలో భారీ పేలుడు.. ఇల్లు కూలి ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
IIIT Raipur | 36 మంది విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్.. స్టూడెంట్ సస్పెండ్