రాయ్‌పూర్: ఒక స్టూడెంట్ 36 మంది విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేశాడు. ఏఐ ఉయోగించి అశ్లీల చిత్రాలుగా మార్చాడు. ఇది బయటపడటంతో బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అంతర్గత కమిటీ దర్యాప్తు తర్వాత ఆ స్టూడెంట్ను బహిష్కరించారు. (IIIT Raipur) ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో ఈ సంఘటన జరిగింది. మూడో ఏడాది చదువుతున్న సయ్యద్ రహీమ్ అద్నాన్ అలీ, 36 మంది క్లాస్మేట్స్ ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ ద్వారా విద్యార్థినుల ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్చాడు.
కాగా, అక్టోబర్ 6న బాధిత మహిళా స్టూడెంట్స్ దీనిని గుర్తించారు. ప్రొఫెసర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా ప్రొఫెసర్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. సయ్యద్ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అభ్యంతరకరమైన ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఉన్నట్లు నిర్ధారించారు. అదే రోజున ఆ విద్యా సంస్థ నుంచి అతడ్ని బష్కరించారు. హాస్టల్ నుంచి పంపివేశారు. తల్లిదండ్రులను రప్పించి బిలాస్పూర్ జిల్లాలోని అతడి సొంతూరుకు పంపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. సమాచార సాంకేతిక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సయ్యద్ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్‌ను కమిటీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ స్టూడెంట్ను అరెస్ట్ చేసేందుకు ఒక పోలీస్ బృందం బిలాస్పూర్ వెళ్లిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Man Kills Wife | భార్యను చంపి.. మృతదేహాన్ని మంచం కింద దాచిన వ్యక్తి
Private Jet Skids Off | టేకాఫ్ సమయంలో.. రన్‌వే నుంచి జారిన ప్రైవేట్ విమానం
Professor KC Sinha | తొలిసారి ఎన్నికల పరీక్ష ఎదుర్కొంటున్న.. బీహార్ గణిత ప్రొఫెసర్ కేసీ సిన్హా