బెంగళూరు: ఒక వ్యక్తికి నాలుగు నెలల కిందట పెళ్లి జరిగింది. అయితే భార్యను అతడు హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని మంచం కింద దాచి పారిపోయాడు. ఆ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి తల్లి మంచం కింద ఉన్న కోడలి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యింది. (Man Kills Wife) కర్ణాటకలోని బెలగావిలో ఈ సంఘటన జరిగింది. ఆకాష్ కంబర్కు నాలుగు నెలల కిందట 20 ఏళ్ల సాక్షితో పెళ్లి జరిగింది. అయితే మూడు రోజుల కిందట భార్యను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని మంచం కింద దాచాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు.
కాగా, ఆకాష్ ఫోన్ సిచ్చాఫ్లో ఉన్నది. ఆందోళన చెందిన అతడి తల్లి గ్రామం నుంచి కుమారుడి ఇంటికి చేరుకున్నది. ఇంట్లోని మంచం కింద కోడలు సాక్షి మృతదేహాన్ని చూసి ఆమె షాక్ అయ్యింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. సాక్షి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబానికి సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వరకట్న వేధింపుల నేపథ్యంలో సాక్షిని భర్త ఆకాష్ హత్య చేసినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది.
Also Read:
Elephants Trample Man | మానసిక వికలాంగుడిని.. తొక్కి చంపిన ఏనుగులు
Private Jet Skids Off | టేకాఫ్ సమయంలో.. రన్వే నుంచి జారిన ప్రైవేట్ విమానం
Bihar Bridge | రూ.6 కోట్లతో వంతెన నిర్మాణం.. అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో నిరూపయోగం