హైదరాబాద్‌లో హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్
హైదరాబాద్ మరో అంతర్జాతీయ క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా మహిళల హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ టోర్నీ జరుగనుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో అంతర్జాతీయ క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా మహిళల హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ టోర్నీ జరుగనుంది. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ఆతిథ్య భారత్ సహా ఎనిమిది దేశాల జట్లు బరిలో ఉన్నాయి. ఇందులో ఆస్ట్రియా, ఇంగ్లండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ ఉన్నాయి. టోర్నీని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్న అస్ట్రోటర్ఫ్ మైదానాన్ని కొత్తగా పునరుద్ధరించారు. టోర్నీ కోసం ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఉరుగ్వే జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. టోర్నీ సందర్భంగా నగరానికి వచ్చే ప్లేయర్లు, ప్రతినిధుల కోసం తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని పరిచయం చేసేలా కార్యక్రమాలను రూపొందించారు. సోమవారం చీఫ్ కోచ్ జోయర్డ్ మారినె నేతృత్వంలో టీమ్ఇండియా ప్రాక్టీస్‌లో చెమటోడ్చింది. ఈ ఏడాది జరిగే హాకీ ప్రపంచకప్‌నకు ఈ టోర్నీ కీలకం కానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

