లక్నో: టేకాఫ్ అవుతున్న ప్రైవేట్ విమానం రన్ వే నుంచి జారింది. రన్ వే పక్కన్న ఉన్న గడ్డిలోకి అది దూసుకెళ్లింది. ఆ ప్రైవేట్ విమానంలో ఉన్న ప్రముఖులకు ప్రమాదం తప్పింది. (Private Jet Skids Off) ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో జెట్ సర్వ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వీటీ డే జెట్ విమానం మొహమ్మదాబాద్ ఎయిర్‌స్ట్రిప్ నుంచి బోఫాల్‌కు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన వెంటనే ఆ విమానం అదుపుతప్పింది. రన్ వే నుంచి సుమారు 400 మీటర్లు జారింది. పక్కనే ఉన్న గడ్డి ప్రాంతంలోకి దూసుకెళ్లి ఆగింది.
కాగా, వుడ్‌పెకర్ గ్రీనాగ్రి న్యూట్రియంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అరోరా, ఎస్బీఐ హెడ్ సుమిత్ శర్మ, బీపీవో రాకేష్ వంటి ప్రముఖులు ఈ ప్రైవేట్ జెట్ విమానంలో ఉన్నారు. అయితే ప్రమాదం తప్పడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
మరోవైపు కెప్టెన్ నసీబ్ బమల్, కెప్టెన్ ప్రతీక్ ఫెర్నాండెజ్ నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగినట్లు ఆ ఫుడ్ కంపెనీ అధికారి ఆరోపించారు. విమానం టైర్లలో తక్కువ గాలి పీడనం ఉన్నట్లు పైలట్లకు తెలిసినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఆ ప్రైవేట్ విమానం వద్దకు చేరుకున్నారు. టేకాఫ్ సమయంలో రన్‌వే నుంచి జారడంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read:
Bihar Bridge | రూ.6 కోట్లతో వంతెన నిర్మాణం.. అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో నిరూపయోగం
man kills wife | అత్తతో అక్రమ సంబంధం.. భార్యను హత్య చేసిన వ్యక్తి
Boy Dies Of Dog Bite | బాలుడ్ని కరిచిన కుక్క.. గుర్తించకపోవడంతో పది రోజుల తర్వాత మృతి