ముంబై: ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడ్ని వీధి కుక్క కరిచింది. తలపై గాయమైంది. అయితే కుక్క కరిచిన విషయాన్ని తన పేరెంట్స్‌కు ఆ బాలుడు చెప్పలేదు. ఆ బాలుడికి రేబిస్ సోకడంతో పది రోజుల తర్వాత మరణించాడు. (Boy Dies Of Dog Bite) మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. మూడేళ్ల ఆర్మాన్ ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసింది. ఆ బాలుడి తలపై అది కరిచింది.
కాగా, ఆర్మాన్ ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లాడు. తాను పడిపోయినట్లు పేరెంట్స్‌కు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడి తలపై కుక్క కరిచిన గాయాన్ని వారు గుర్తించలేకపోయారు. అయితే ఎనిమిది రోజుల తర్వాత ఆర్మాన్ తల గోక్కోవడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. పరిశీలించగా జట్టు కింద తలపై ఉన్న గాయాన్ని గుర్తించారు. ఆరా తీయగా ఆ బాలుడ్ని కుక్క కరిచినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు అప్పటికే రేబిస్ లక్షణాలు కనిపించిన ఆర్మాన్‌కు చికిత్స అందించేందుకు మూడు ఆసుపత్రులు నిరాకరించాయి. ఆ బాలుడు బతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. కుటుంబ సభ్యులు టీకాలు వేయించుకోవాలని సూచించారు. చివరకు కుక్క కరిచిన పది రోజుల తర్వాత ఆ బాలుడు మరణించాడు.
కాగా, ఆర్మాన్‌ను వీధి కుక్క కరిచినట్లు తమకు తెలియలేదని, ఎవరూ కూడా ఈ విషయాన్ని తమకు చెప్పలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ముందుగా తెలిసి ఉంటే ఆ చిన్నారిని కాపాడుకునేవారమని ఆవేదన చెందారు. తమ కుటుంబానికి జరిగిన మాదిరిగా ఎవరికీ జరుగకుండా ఉండేందుకు వీధి కుక్కలను అధికారులు నివారించాలని ఆర్మాన్ కుటుంబం డిమాండ్ చేసింది.
Also Read:
Watch: కుక్కల బెడదపై వీధి నాటకం.. ఆర్టిస్ట్‌ను కరిచిన వీధి కుక్క
Bodies Left On Stretchers | ఫ్రీజర్ల కొరత.. స్ట్రెచర్లపైనే రోడ్డు ప్రమాద బాధితుల మృతదేహాలు
Watch: కొండచరియలు విరిగిపడిన రోగులకు చికిత్స కోసం.. పెద్ద సాహసం చేసిన డాక్టర్