తిరువనంతపురం: కుక్కల బెడదపై వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఒక కుక్క తన అసలు పాత్రను పోషించింది. (Street Play On Stray Dogs) ఆ ఆర్టిస్ట్‌ను నిజంగా కరిచింది. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం కందన్కైలోని పీ కృష్ణప్పిల్ల లైబ్రరీలో వీధి కుక్కల బెడదపై ‘పెక్కోలం’ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. ఆర్టిస్ట్ పీ రాధాకృష్ణన్ ఏకపాత్రాభినయం చేశాడు. ఒక కుక్క వెంటపడుతున్నట్లు, దాని బారి నుంచి తప్పించుకుని పరుగెత్తుతూ చేతిలోని కర్రతో తరుముతున్నట్లుగా అతడు నటించాడు.
కాగా, ఉన్నట్టుండి ఒక నల్లని వీధి కుక్క అక్కడకు వచ్చింది. ఆ నాటకంలోకి ప్రవేశించిన అది తన అసలు పాత్ర పోషించింది. వీధి కుక్క కరవడంతో కూతుర్ని కోల్పోయిన తండ్రి పాత్రను రంజింపజేసిన రాధాకృష్ణన్ కాలును అది కరించింది.
మరోవైపు ఇది గమనించిన ఒక వ్యక్తి ఆ కుక్క వద్దకు వెళ్లాడు. చెప్పుతో దానిని అక్కడి నుంచి తరిమాడు. కుక్క కరవడంతో గాయమైన రాధాకృష్ణన్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కాగా, వీధి కుక్కల దాడుల గురించి అవగాహన పెంచే నాటకంలో ఆర్టిస్ట్‌ను నిజంగా కుక్క కరవడం ఈ సమస్యకు అద్దం పట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
கேரள மாநிலம் கண்ணூரில், தெருநாய் தாக்குதல் குறித்த விழிப்புணர்வு நாடகம் நடத்திக்கொண்டிருந்த ராதாகிருஷ்ணன் என்பவரை, மேடையில் எதிர்பாராதவிதமாக ஒரு தெருநாய் கடித்தது. வலிக்கு மத்தியிலும் நாடகத்தை முழுமையாக முடித்த அவர், பின்னர் சிகிச்சைக்காக மருத்துவமனை சென்றார். விழிப்புணர்வு… pic.twitter.com/AeWZjMt1vP
— PttvOnlinenews (@PttvNewsX) October 6, 2025
Also Read:
Tejashwi Yadav | నితీశ్ వీడియోను షేర్ చేసిన తేజస్వీ యాదవ్.. ఆయన మానసిక పరిస్థితిపై వ్యాఖ్యలు
Watch: ఆటోను భుజాలపై మోసి నదిని దాటించిన స్థానికులు.. ఎందుకంటే?
Watch: ఆడ సింహంపై మగ సింహం దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?