శ్రీనగర్: కర్రలకు కట్టిన ఆటోను కొందరు వ్యక్తులు తమ భుజాలపై మోశారు. ఆ ఆటోను నదిని దాటించారు. (Locals Carry Auto) పదేళ్ల కిందట భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోవడంతో నాటి నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బంట్ గ్రామంలోని నదిపై నిర్మించిన వంతెన పదేళ్ల కిందట భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో నాటి నుంచి గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఒక ఆటోకు కర్రలు కట్టి భుజాలపై మోసి నదిని దాటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, వంతెన కొట్టుకుపోయి పదేళ్లైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని విమర్శించారు. ఈ గ్రామం నుంచి సమరోలికి నడిచి వెళ్ళడానికి నాలుగు గంటలు పడుతుందని తెలిపారు. దీంతో స్కూల్‌కు వెళ్లే పిల్లలతోపాటు రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లోతైన ఈ నదిని చాలా భయంతో దాటుతున్నారని వాపోయారు. తమ బాధలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వంతెన విషయంలో ఎలాంటి సహాయం చేయడం లేదని విమర్శించారు.
#WATCH | Villagers from Bant Village of Jammu and Kashmir’s Udhampur district carry an Auto Rickshaw on their shoulders to cross a river, after a key bridge was washed away by heavy rains in recent times. pic.twitter.com/0FVuhEG0qO
— ANI (@ANI) October 5, 2025
Also Read:
Cow Cess On Liquor | మద్యంపై 20 శాతం ‘ఆవు పన్ను’.. బార్ బిల్లు ఫొటో వైరల్
Mud Volcano Erupts | 20 ఏళ్ల తర్వాత బద్దలైన.. భారత్‌లోని ఏకైక మట్టి అగ్నిపర్వతం
Watch: పెళ్లిలో సోదరుడి పాత్ర పోషించిన సైనికులు.. విధుల్లో మరణించిన వధువు అన్న లోటు తీర్చారు