జైపూర్: ఒక బారులో బీర్లు కొన్న వ్యక్తి బిల్ చూసి షాక్ అయ్యాడు. అందులో ‘ఆవు పన్ను’ పేరుతో 20 శాతం మేర విలువ ఆధారిత పన్ను (వ్యాట్)లో అదనంగా వసూలు చేశారు. (Cow Cess On Liquor) ఈ బిల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన వ్యక్తి తన ఫ్రెండ్స్‌తో కలిసి సెప్టెంబర్ 30న పార్క్ ప్లాజాలోని జియోఫ్రీ బార్‌కు వెళ్లాడు. ఆరు బీర్లు, మొక్కజొన్న వడలు ఆర్డర్ చేశాడు.
కాగా, ఆ ఆర్డర్ మొత్తం రూ. 2,650. అయితే జీఎస్టీ, వ్యాట్‌తోపాటు 20 శాతం ‘ఆవు పన్ను’తో కలిపి మొత్తం రూ. 3,262కు బిల్లు జారీ చేశారు. మద్యంపై ఆవు పన్ను విధించడం చూసి ఆ కస్టమర్ షాక్ అయ్యాడు. ఈ బిల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఆ బార్ యాజమాన్యం దీనిపై వివరణ ఇచ్చింది. గోవుల రక్షణ, సంరక్షణ కోసం 2018లో ఆవు పన్నును రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపింది. అప్పటి నుంచి మద్యం అమ్మకాలపై ఆ పన్ను వసూలు చేస్తున్నట్లు చెప్పింది.
అయితే చాలా బార్ అండ్ రెస్టారెంట్లు దీనిని సర్‌ఛార్జ్‌గా పేర్కొంటాయని, కానీ తాము వ్యాట్‌లో అదనంగా కౌ సెస్సుగా ప్రస్తావిస్తామని ఆ బార్ యాజమాన్యం వివరించింది. ఆ పన్ను డబ్బును గో సంరక్షణ, ప్రచార సెస్సుగా ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తామని వెల్లడించింది.
కాగా, మద్యం అమ్మకాలపై వ్యాట్ విధించినప్పుడల్లా ఆవు పన్నును కూడా విధిస్తారని రెవెన్యూ అధికారి కూడా స్పష్టం చేశారు. అయితే చాలా బార్ అండ్ రెస్టారెంట్లు దీనిని సర్జ్ఛార్జ్గా పేర్కొంటాయని వివరణ ఇచ్చారు.
Also Read:
Cough Syrup Row | దగ్గు మందు మరణాలపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు.. డ్రగ్ కంట్రోలర్ సస్పెండ్
Man Murdered for insurance | రూ.5 కోట్ల బీమా కోసం వ్యక్తి హత్య.. క్లైమ్ చేసిన నకిలీ భార్య
Watch: పెళ్లిలో సోదరుడి పాత్ర పోషించిన సైనికులు.. విధుల్లో మరణించిన వధువు అన్న లోటు తీర్చారు