జైపూర్: దగ్గు మందు వల్ల పిల్లలు మరణించినట్లు వచ్చిన ఆరోపణలపై రాజస్థాన్ ప్రభుత్వం స్పందించింది. (Cough Syrup Row) ఆ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌ను సస్పెండ్ చేసింది. అలాగే జైపూర్‌కు చెందిన కేసన్స్ ఫార్మా తయారు చేసిన 19 మందుల పంపిణీని నిలిపివేసింది. డెక్స్ట్రోమెథోర్ఫాన్ కలిగిన అన్ని ఇతర దగ్గు సిరప్‌ల పంపిణీని కూడా నిలిపివేసినట్లు ఆరోగ్య శాఖ తెలిసింది. ఔషధ ప్రమాణాలను నిర్ణయించే ప్రక్రియను ప్రభావితం చేశారనే ఆరోపణలపై డ్రగ్ కంట్రోలర్ రాజారాం శర్మను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆ శాఖ వెల్లడించింది.
కాగా, దగ్గు సిరప్ వల్ల మధ్యప్రదేశ్‌లో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ స్పందించారు. దీనిపై వివరణాత్మక దర్యాప్తు, సమర్థవంతమైన చర్యలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ సూచనలతో దర్యాప్తు కోసం నిఫుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికార ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read:
No Toxins In Cough Syrup | పిల్లల మరణాల దగ్గు సిరప్‌లో విషపూరితాలు లేవు: కేంద్రం
Man Shoots Friend | ఫ్రెండ్‌ను కాల్చి చంపిన వ్యక్తి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్