లక్నో: ఒక వ్యక్తి తన స్నేహితుడ్ని కాల్చి చంపాడు. 11 సెకన్లలో మూడు బుల్లెట్లు పేల్చాడు. (Man Shoots Friend) మరో వ్యక్తి దీనిని రికార్డ్ చేశాడు. హత్య తర్వాత నిందితులు ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 1న ఒక వ్యక్తి నేలపై పడుకుని ఉన్నాడు. సొంత స్నేహితుడు అతడి ఛాతిపై వరుసగా మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీనిని వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి ‘డ్రాప్ ఇట్’ అని అనడంతో అతడు కాల్పులు ఆపాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి బైక్‌పై వెళ్లిపోయారు. అనంతరం నిందితులు ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.
కాగా, ఒకచోట పడి ఉన్న హతుడ్ని ఆదిల్‌గా పోలీసులు గుర్తించారు. అతడి కుటుంబం ఫిర్యాదుపై ఆరుగురిపై కేసు నమోదు చేశారు. కాల్పులకు ముందు ఆదిల్ అపస్మారక స్థితిలో ఉన్నాడా? లేక అతడ్ని చంపిన తర్వాత కాల్పులు జరిపి వీడియో రికార్డ్ చేశారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు ఆదిల్ హత్య వెనుక గల కారణాలు, నిందితులు వీడియో రికార్డ్ చేసి ఎందుకు వైరల్ చేశారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పోలీసులను బహిరంగంగా సవాల్ చేసే ఇలాంటి చర్యల వెనుక వ్యవస్థీకృత ముఠాలు ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. అలాగే అదే రోజున మీరట్‌లోని ఇతర ప్రాంతాల్లో మరో రెండు హత్యలు నమోదైనట్లు వెల్లడించారు.
Also Read:
Delivery Boy Kidnaps, Rapes Girl | బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసిన డెలివరీ బాయ్
Mud Volcano Erupts | 20 ఏళ్ల తర్వాత బద్దలైన.. భారత్‌లోని ఏకైక మట్టి అగ్నిపర్వతం