పోర్ట్ బ్లెయిర్: సుమారు 20 ఏళ్లకుపైగా నిద్రాణంగా ఉన్న భారత్‌లోని ఏకైక మట్టి అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. (Mud Volcano Erupts) పెద్ద శబ్దంతో భూమి లోపల నుంచి బురద, వాయువులను పైకి ఎగజిమ్మింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అండమాన్, నికోబార్ దీవులలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 2న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బరాటాంగ్లోని జార్వా క్రీక్‌లో పెద్ద శబ్దంతో మట్టి అగ్నిపర్వతం బద్దలైంది. బురద, వాయువులను ఎగజిమ్మింది.
కాగా, మట్టి అగ్నిపర్వతం పేలుడు వల్ల సుమారు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తుతో మట్టి దిబ్బ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. వెయ్యి చదరవు మీటర్లకు పైగా బురద వ్యాపించినట్లు చెప్పారు. విస్ఫోటనం ఇంకా కొనసాగుతున్నదని, బురదతో పాటు పొగలు బయటకు వస్తున్నాయని వెల్లడించారు. ఈ మట్టి అగ్నిపర్వతం చివరగా 2005లో బద్దలైందని వివరించారు.
మరోవైపు పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. మట్టి అగ్నిపర్వతం ఉన్న ప్రాంతం వైపు అన్ని రాకపోకలను నిలిపివేశారు. స్థానికులతో పాటు పర్యాటకులను అలెర్ట్ చేశారు. భూగర్భ శాస్త్ర విభాగానికి ఈ సమాచారం అందించారు.
Also Read:
Tej Pratap | రాముడు ఎవరో, లక్ష్మణుడు ఎవరో తేజస్వీ అర్థం చేసుకోవాలి: తేజ్ ప్రతాప్
Elephant Theft | ఏనుగు చోరీపై వ్యక్తి ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు