రాంచీ: తాను కొనుగోలు చేసిన ఏనుగు చోరీ అయ్యిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. (Elephant Theft) మావటివాడు మోసం చేసినట్లు ఆరోపించాడు. ఈ అసాధారణ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన నరేంద్ర కుమార్ శుక్లా, ఆగస్ట్ నెలలో జార్ఖండ్‌లోని పాలము జిల్లా జోర్కట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఏనుగు జయామతిని జార్ఖండ్‌లోని రాంచీ నుంచి జౌన్‌పూర్‌కు తరలిస్తుండగా మావటివాడు దొంగిలించాడని ఆరోపించాడు. ఏనుగులను పెంచే కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు కోటి విలువున్న దానిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కాగా, ఏనుగు చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బీహార్‌లోని చాప్రాకు చెందిన గోరఖ్ సింగ్ వద్ద ఆ ఆడ ఏనుగు ఉన్నట్లు సెప్టెంబర్ 29న తెలుసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా రూ.27 లక్షలకు దానిని కొన్నట్లు చెప్పాడు. దీంతో మావటివాడు ఆ ఏనుగును అతడికి అమ్మి ఉంటాడని పోలీసులు అనుమానించారు.
మరోవైపు పోలీసులు మరింతగా దర్యాప్తు చేయగా విస్తూపోయే విషయాలు తెలిశాయి. నరేంద్ర కుమార్‌తో పాటు మరో ముగ్గురు కలిసి ఆ ఏనుగును జాయింట్‌గా రూ.40 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నారు. అయితే ముగ్గురు భాగస్వాములు ఒక ఒప్పందం కుదుర్చుకుని చాప్రాలోని ఆ వ్యక్తికి రూ. 27 లక్షలకు దానిని విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
కాగా, ఆ ఏనుగు కొనుగోలుకు సంబంధించిన పత్రాలను గోరఖ్ సింగ్ సమర్పించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీంతో మిగతా భాగస్వాములను కూడా ఏనుగు కొనుగోలు పత్రాలను సమర్పించాలని కోరినట్లు చెప్పారు. ఆ పత్రాలను ధృవీకరించిన తర్వాత చట్టపరంగా ఆ ఏనుగు అసలు యజయాని ఎవరు అన్నది నిర్ధారిస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: ఫుడ్ డెలివరీ బాయ్‌కు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Thrashes Children | చికెన్ కావాలని అడిగిన పిల్లలు.. చపాతీ కర్రతో కొట్టిన తల్లి, కొడుకు మృతి