న్యూఢిల్లీ: ఫుడ్ ఆర్డ్ చేసిన వ్యక్తి డెలివరీ బాయ్‌కు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించాడు. అతడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. (Man Refuses To Pay For Food) దీంతో డెలివరీ బాయ్ పోలీసులకు ఫోన్ చేశాడు. తాగి ఉన్న వ్యక్తి అక్కడకు చేరుకున్న పోలీసుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నరేలా ప్రాంతంలో నివసించే రిషి కుమార్ టీచర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ అర్జున్ ఆర్డర్ చేసిన ఫుడ్ అందజేశాడు.
కాగా, మద్యం తాగిన మత్తులో ఉన్న టీచర్ రిషి కుమార్ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించాడు. డెలివరీ బాయ్‌ను తిట్టడంతో పాటు కొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అర్జున్ పోలీసులకు ఫోన్ చేశాడు. ఇద్దరు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తాగిన మత్తులో ఉన్న టీచర్ రిషి కుమార్ వారి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అతడ్ని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అయితే అర్జున్ మరిన్ని ఆర్డర్లు డెలివరీ చేయాల్సి ఉండటంతో ఫిర్యాదు చేయలేదని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో రిషి కుమార్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు చెప్పారు. హాస్పిటల్లో వైద్య పరీక్షల సమయంలో అతడు తప్పుడు పేరు చెప్పడంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. పోలీసులు ఆ టీచర్‌ను బలవంతంగా తీసుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
नरेला मे zometo से ऑर्डर कैंसिल किया तो zometo वाले ने बुलाई पुलिस और फिर सब आपके सामने है कैसे घर से पिटते हुए युवक को ले गई थाने @dcp_outernorth @CPDelhi @DelhiPolice pic.twitter.com/UGiMQwBFQC
— Raajesh Khatri (@KhatriRajeesh) October 1, 2025
Bengaluru Student Dies | మరో విద్యార్థిని ప్రాణాలు తీసిన.. బెంగళూరు రోడ్డు గుంతలు