ఖమ్మం రూరల్, మార్చి 16 : తెలంగాణ ఆషా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఖమ్మం రూరల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( యం వి పాలెం) ముందు సోమవారం తెలంగాణ ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారినికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమాళ్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఆశా వర్కర్స్ కు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు.
ఫిబ్రవరి నెల వేతనం వెంటనే ఇవ్వాలని, అదనపు పనికి అదనపు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళ, బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు నిర్వహించే 48 గంటల ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షుడు బి.మల్లీశ్వరి, కార్యదర్శి బి.జ్యోతి, జిల్లా నాయకులు సుభద్ర, భాగ్యమ్మ, మండల నాయకులు కృష్ణవేణి, సూరమ్మ, అరుణ, సావిత్రి, తిరపమ్మ, మమత, నాగమణి, జ్యోతి, మంజుల, ఉప్పలమ్మ పాల్గొన్నారు.