కీర్తిసురేశ్ తెరపైనే కాదు. రియల్ లైఫ్‌లోనూ షార్ప్‌గా ఉంటారు. తనపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడంలో ఆమె శైలి ప్రత్యేకంగా ఉంటుంది. తాజాగా ఆమె నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో భాగమైంది. ఆ సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో కీర్తి సురేశ్ నర్తించింది. ఈ విషయంపై ఓ యువతి.. అవకాశాలు లేక ఐటమ్ సాంగ్ చేసిందంటూ కీర్తి సురేశ్‌ని విమర్శిస్తూ తన ఇన్‌స్టాలో ఓ వీడియోని షేర్ చేసింది.
పైగా ‘ది ప్యారడైజ్’ సినిమాను కన్నడ సినిమాగా ఆమె ఆ వీడియోలో పేర్కొన్నది. ఈ విమర్శపై కీర్తి సురేశ్ కూల్‌గా తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ‘ది ప్యారడైజ్’ని కన్నడ సినిమా అనడంపై ‘వేరే లెవల్..’ అంటూ కీర్తి సైటైర్ విసిరింది. ‘చిన్న కరెక్షన్.. నాని నటిస్తున్న తెలుగు సిని మా.. కన్నడ సినిమా కాదు’ అంటూ కౌంటరిచ్చింది. అంతే.. సరిగ్గా చెప్పావ్ అన్నట్టుగా పలువురు నెటిజన్లు కీర్తి సురేశ్‌ని అభినందిస్తూ కామెట్లు పెడుతున్నారు.