బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లపై ఉన్న గుంతలు మరో విద్యార్థిని ప్రాణాలు హరించాయి. (Bengaluru Student Dies) స్కూటీపై కాలేజీకి వెళ్లున్న యువతి రోడ్డుపై ఉన్న గుంతను తప్పించేందుకు ప్రయత్నించింది. అదుపు తప్పి రోడ్డుపై పడింది. ఆమెపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది. ఉత్తర బెంగళూరులోని అవలహళ్లి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం బీకామ్ రెండో ఏడాది చదువుతున్న 22 ఏళ్ల ధనుశ్రీ స్కూటీపై కాలేజీకి వెళ్తున్నది. బుడిగెరె క్రాస్ సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పింది. స్కూటీతోపాటు రోడ్డుపై పడిపోయింది.
కాగా, వెనుక నుంచి వచ్చిన లారీ, కింద పడిన ధనుశ్రీ పైనుంచి దూసుకెళ్లింది. దీంతో తల నుజ్జై అక్కడికక్కడే మరణించింది. స్థానిక పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ప్రమాదం తర్వాత ఆగకుండా లారీతో పాటు పారిపోయిన డ్రైవర్ను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు బెంగళూరులోని ప్రతి రోడ్డులో ఉన్న గుంతలను పూడ్చడానికి అధికారులకు సీఎం సిద్ధరామయ్య 30 రోజులు గడువు ఇచ్చారు. అయినప్పటికీ గుంతల రోడ్డు వల్ల మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read:
Leh Apex Body | కేంద్రంతో చర్చలను బహిష్కరించిన లేహ్ అపెక్స్ బాడీ
Watch: హుక్ తెగి పక్కకు ఒరిగిన జైంట్ వీల్, గాలిలో రైడర్స్.. తర్వాత ఏం జరిగిందంటే?