లేహ్: కేంద్రంతో చర్చలను బహిష్కరిస్తున్నట్లు లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ) (Leh Apex Body) సోమవారం ప్రకటించింది. ఆరో షెడ్యూల్ కింద లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగ పరిరక్షణ కోసం సెప్టెంబర్ 24న జరిగిన ఆందోళనలో భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు మరణించగా, సుమారు వంద మంది గాయపడ్డారు. ఈ కాల్పుల సంఘటనపై నిష్పాక్షిక న్యాయ విచారణ జరుపాలని ఎల్ఏబీ డిమాండ్ చేసింది. లడఖ్ నిరసనకారులను ‘జాతి వ్యతిరేకులు’గా, ‘పాకిస్థాన్ చేతుల్లో కీలుబొమ్మలు’గా పేర్కొన్న కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
కాగా, లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (కేడీఏ) కలిసి లడఖ్ రాష్ట్ర హోదా, రాజ్యాంగ పరిరక్షణ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్నాయి. సెప్టెంబర్ 24న లేహ్‌లో జరిగిన ఆందోళనపై ఎల్ఏబీ, కేడీఏ సభ్యులతో సహా కేంద్రం, లడఖ్ ప్రతినిధుల మధ్య తదుపరి చర్చలు అక్టోబర్ 6న జరుగాల్సి ఉన్నది.
మరోవైపు లఢఖ్ నిరసనలపై కేంద్ర పాలిత ప్రభుత్వం తప్పుగా వ్యవరించినట్లు ఎల్ఏబీ, కేడీఏ ఆరోపించాయి. లడఖ్ రాష్ట్ర హోదా ప్రచారకర్త సోనమ్ వాంగ్చుక్ను కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్టు చేయడంపై మండిపడ్డాయి. ఆయనతోపాటు అరెస్ట్ చేసిన ఇతరులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.
Also Read:
Woman Thrashes Children | చికెన్ కావాలని అడిగిన పిల్లలు.. చపాతీ కర్రతో కొట్టిన తల్లి, కొడుకు మృతి
Watch: హుక్ తెగి పక్కకు ఒరిగిన జైంట్ వీల్, గాలిలో రైడర్స్.. తర్వాత ఏం జరిగిందంటే?