ముంబై: పిల్లలు తమ తల్లిని చికెన్ కావాలని అడిగారు. ఆగ్రహించిన ఆమె చపాతీ కర్రతో వారిని కొట్టింది. (Woman Thrashes Children) దెబ్బలు తాళలేక కుమారుడు మరణించాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మహారాష్ట్రలోని పాల్గఢ్లో ఈ సంఘటన జరిగింది. కాశీపాద ప్రాంతంలోని ఒక ఫ్లాట్లో 40 ఏళ్ల పల్లవి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నది. ఆదివారం కావడంతో చికెన్ కూర వండాలని పిల్లలు తల్లిని అడిగారు. దీంతో పల్లవి ఆగ్రహించింది. వంట గదిలో ఉన్న చపాతీ కర్రతో పిల్లలను దారుణంగా కొట్టింది. ఏడేళ్ల కుమారుడు చిన్మయ్ గణేష్ అక్కడికక్కడే మరణించాడు. పదేళ్ల కుమార్తె తీవ్రంగా గాయపడింది.
కాగా, పిల్లల అరుపులు విన్న పొరుగువారు ఇది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. పల్లవి కొట్టడంతో మరణించిన కుమారుడు చిన్మయ్ గణేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లి పల్లవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Private Photos Leak | బ్రేకప్ తర్వాత మాజీ ప్రియురాలి ప్రైవేట్ ఫొటోలు లీక్.. వ్యక్తి అరెస్ట్
trains Coaches decouple | గంటలోపు.. రెండుసార్లు విడిపోయిన రైల్ కోచ్లు
Watch: రోడ్డు ప్రమాదంలో గాయపడిన నెమలి.. రక్షించే బదులు ఈకలు పీకిన గ్రామస్తులు