టెహ్రాన్: ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు జరిగిన అటాక్‌లో.. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో ఉన్న ఓ బాలికల స్కూల్‌పై క్షిపణి పడింది. ఆ పేలుడు ఘటనలో సుమారు 160 మంది వరకు విద్యార్థిణులు మరణించారు. ఆ విషాద సంఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఆ దాడి వెనుక అమెరికా ఉన్నట్లు ఇరాన్ ఆరోపించగా, బాలికల స్కూల్‌పై తాము దాడి చేయలేదని ట్రంప్ అన్నారు. అయితే తాజాగా మినాబ్ స్కూల్‌పై మిస్సైల్ పడుతున్న ఘటనకు చెందిన ఓ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. ఆ వీడియో ఫూటేజ్ ఆధారంగా అది అమెరికా వాడే తోమాహాక్ క్షిపణి(Tomahawk Missile)గా గుర్తించారు. మెహర్ న్యూస్ ఏజెన్సీ ఆ వీడియోను షేర్చేసింది. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా అమెరికాకు చెందిన మీడియా సంస్థలు కూడా ఆ క్షిపణి అమెరికాదే అని నిర్ధారించాయి. స్కూల్ సమీపంలో ఉన్న ఐఆర్జీసీ నావల్ కాంప్లెక్స్‌ను టార్గెట్ చేసే క్రమంలో బహుశా ఆ క్షిపణి స్కూల్‌పై పడి ఉంటుందని వాషింగ్టన్ పోస్టు తన కథనంలో చెప్పింది. ఇంటెలిజెన్స్ సమాచారం వల్ల ఆ వైఫల్యం జరిగి ఉంటుందని సీబీఎస్ న్యూస్ తన కథనంలో పేర్కొన్నది.
ఇరాన్‌పై దాడిలో తోమాహాక్ క్షిపణులను వాడినట్లు అమెరికా చెబుతోంది. ఆ క్షిపణులు సుమారు 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగలవు. ప్రస్తుతం జరుగుతున్న వార్‌లో కేవలం అమెరికా వద్దే ఇలాంటి ఆయుధాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ క్షిపణియే ఆ స్కూల్‌పై పడినట్లు ఇటీవల ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ వాదనలను ఖండిస్తూ ఈ వీడియోను రిలీజ్ చేశారు. తోమాహాక్ తరహాలోనే క్షిపణి ఉన్నట్లు అమెరికా వైమానిక దళ స్పెషల్ ఆపరేషన్స్ నిపుణుడు వెస్ బ్రాంట్ తెలిపారు. ఇరాన్ వద్ద ఇలాంటి క్షిపణులు లేవని మిడిల్బరీ కాలేజీ ప్రొఫెసర్ జెఫ్రీ లూయిస్ తెలిపారు.
🚨🇺🇸🇮🇷 BREAKING:
Multiple media outlets are confirming what Iran’s been saying: A U.S. Tomahawk missile hit the Shajareh Tayyebeh girls’ elementary school in Minab.
Death toll: 165-180, mostly children aged 7-12.
Israel doesn’t possess Tomahawk missiles. Only the… https://t.co/6TXhmROkUn pic.twitter.com/EawEZhOnAL
— Mario Nawfal (@MarioNawfal) March 8, 2026