ముంబై: ఒక రైలులోని కోచ్‌లు గంటలోపు రెండుసార్లు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. రైల్వే అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుని కోచ్‌లను తిరిగి లింక్ చేశారు. (trains Coaches decouple) ఈ సంఘటనల వల్ల ఆ రైలు ప్రయాణం ఆలస్యమైంది. బాంద్రా టెర్మినస్-అమృత్సర్ పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీలు రెండుసార్లు రైలు నుంచి విడిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం 1.19 గంటల సమయంలో తొలిసారి వంగావ్, దహను స్టేషన్ల మధ్య ఆ రైలు నుంచి బోగీలు వేరయ్యాయి. దీంతో సుమారు 25 నిమిషాలపాటు ఆ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. కోచ్‌లను కలిపిన తర్వాత మధ్యాహ్నం 1.46 గంటలకు బయలుదేరింది.
కాగా, మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో గుజరాత్‌లోని సంజన్ స్టేషన్ సమీపంలో ఆ ట్రైన్ కోచ్‌లు మరోసారి విడిపోయాయి. వల్సాద్ నుంచి రైల్వే అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకుని తనికీ చేశారు. విడిపోయిన కోచ్‌లను రైలుకు కలిపారు. దీంతో 3.15 గంటలకు ఆ రైలు తిరిగి బయలుదేరింది.
మరోవైపు రెండుసార్లు బోగీలు విడిపోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. అలాగే ప్రయాణికుల భద్రతపై ఈ సంఘటన ఆందోళన కలిగించింది. అయితే ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. కోచ్‌లు రెండుసార్లు విడిపోవడంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆ రైలు ప్రయాణం ఆలస్యమైందని వెల్లడించారు.
Also Read:
Trainer Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి జారిన శిక్షణ విమానం.. పైలట్ సురక్షితం
Prashant Kishor | ‘నా పార్టీ టాప్‌లో లేదా కింద ఉంటుంది’.. బీహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్
Watch: రోడ్డు ప్రమాదంలో గాయపడిన నెమలి.. రక్షించే బదులు ఈకలు పీకిన గ్రామస్తులు