అహ్మదాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో శిక్షణ విమానం రన్‌వే నుంచి పక్కకు జారింది. (Trainer Aircraft Skids Off Runway) అది ఒక పక్కకు ఒరిగిపోయింది. అయితే ట్రైనీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. గుజరాత్‌లోని అమ్రేలిలో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన సింగిల్ సీటర్ ట్రైనర్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఆదివారం మధ్యాహ్నం అమ్రేలి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారిపోయింది. ఆ శిక్షణ విమానం ఒక పక్కకు ఒరిగిపోయింది.
కాగా, అందులో ఉన్న ట్రైనీ పైలట్ సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. పైలట్‌కు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. శిక్షణ విమానం దెబ్బతిన్నదని వివరించారు. పౌర విమానయాన అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఎయిర్పోర్ట్ సమీపంలో నివసించే ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Amreli માં મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરકી ગયું, દુર્ઘટના ટળી | Gujarat Samachar#Amreli #Gujarat #GujaratiNews #GujaratSamachar pic.twitter.com/Nx7jQ2ZEDI
— Gujarat Samachar (@gujratsamachar) September 28, 2025
Also Read:
Watch: రోడ్డు ప్రమాదంలో గాయపడిన నెమలి.. రక్షించే బదులు ఈకలు పీకిన గ్రామస్తులు
Prashant Kishor | ‘నా పార్టీ టాప్‌లో లేదా కింద ఉంటుంది’.. బీహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్
Sonam Raghuvanshi | దసరా రోజున.. సోనమ్ దిష్టిబొమ్మ దహనాన్ని నిషేధించిన కోర్టు