న్యూఢిల్లీ: ఒక నెమలి రోడ్డు ప్రమాదంలో గాయపడింది. గమనించిన గ్రామస్తులు దానిని రక్షించడం పోయి మరింతగా హాని తలపెట్టారు. జాతీయ పక్షి అయిన నెమలి ఈకలు పీక్కొని వెళ్లారు. (Villagers Pluck Peacock Feathers) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రోడ్డు దాటుతున్న నెమలిని ఒక వాహనం ఢీకొట్టింది. దీంతో అది తీవ్రంగా గాయపడింది. కదలలేని స్థితిలో రోడ్డుపై పడిపోయింది.
కాగా, అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు ఇది చూశారు. గాయపడిన నెమలిని రక్షించే బదులు దారుణంగా ప్రవర్తించారు. దాని ఈకలను పీక్కొని వెళ్లారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ పక్షి పట్ల దారుణంగా వ్యవహరించిన ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Look at the behavior of people—this peacock, our national bird, has died, and people are stealing its wings. Even after death, cruelty continues.
This is the heartbreaking reality for animals in our country. Do they even have rights? We must do better. #AnimalRights… pic.twitter.com/ZrzBhAgoK4
— Vidit Sharma 🇮🇳 (@TheViditsharma) September 13, 2024
Also Read:
Prashant Kishor | ‘నా పార్టీ టాప్లో లేదా కింద ఉంటుంది’.. బీహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్
Sonam Raghuvanshi | దసరా రోజున.. సోనమ్ దిష్టిబొమ్మ దహనాన్ని నిషేధించిన కోర్టు
Girl Kidnapped, Raped | బాలికను కిడ్నాప్ చేసి ఆరు నెలలుగా అత్యాచారం.. రక్షించిన పోలీసులు
Watch: మహిళను గాల్లోకి విసిరిన ఎద్దు.. వీడియో వైరల్