లక్నో: ఇరుకైన వీధిలో నడుస్తున్న మహిళపై ఎద్దు దాడి చేసింది. ఆమె వెనుక నుంచి వచ్చి కొమ్ములతో ఎత్తిపడేసింది. (Stray Bull Tosses Woman) దీంతో గాలిలోకి ఎగిరిన ఆ మహిళ నేలపై పడింది. గాయపడిన ఆమె చాలాసేపు కదలకుండా ఉండిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 25న సాయంత్రం వేళ బాబినా గ్రామంలోని ఇరుకైన వీధిలో ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తున్నది. ఇంతలో భారీగా ఉన్న నల్లని ఎద్దు ఆమె వెనుక నుంచి వచ్చింది. ఆ మహిళను కొమ్ములతో ఎత్తిపడేసింది.
కాగా, గాలిలోకి ఎగిరిన ఆ మహిళ అక్కడి నేలపై పడింది. గాయపడిన ఆమె చాలాసేపు అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత పక్కకు తిరిగి స్పృహ కోల్పోయింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఆ వీధిలోకి వచ్చాడు. మహిళను కొమ్ములతో ఎత్తిపడేసిన ఎద్దును చూసి అతడు షాక్ అయ్యాడు. దానిని అక్కడి నుంచి తరిమాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
हादसे हर वक़्त आपका पीछा कर रहे होते हैं 🛑
हमेशा सतर्क रहिएयूपी के झांसी में बबीना का वीडियो. महिला को सांड ने टक्कर मारकर हवा में उछाल दिया. pic.twitter.com/CcMms7HlkI
— Ankit Muttrija (@Anku194) September 26, 2025
Also Read:
juvenile stabs boy to death | బెయిల్‌పై బయటకు వచ్చిన బాల నేరస్తుడు.. కత్తితో పొడిచి బాలుడ్ని హత్య
cop dies of rabies | పోలీస్ అధికారిని రక్కిన కుక్క.. రేబిస్ సోకి మృతి
Jail For Cops | యువకుడి కస్టడీ డెత్‌పై కోర్టు సంచలన తీర్పు.. నలుగురు పోలీసులకు 11 ఏళ్లు జైలు శిక్ష
Boy Hides To Skip Tuition | ట్యూషన్‌కు వెళ్లకుండా దాక్కున్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?