న్యూఢిల్లీ: జంట హత్యల కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన బాల నేరస్తుడు మరో హత్యకు పాల్పడ్డాడు. కత్తితో పొడిచి బాలుడ్ని చంపాడు. ఈ నేపథ్యంలో ఆ బాల నేరస్తుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (juvenile stabs boy to death) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు నెలల కిందట అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.
కాగా, గురువారం రాత్రి 8 గంటల సమయంలో సీలంపూర్ ప్రాంతంలోని క్రాసింగ్ వద్ద ఆ బాల నేరస్తుడు, 15 ఏళ్ల బాలుడి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో వెంట ఉన్న కత్తితో అతడ్ని పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడ్ని హాస్పిటల్‌కు తరలించగా అక్కడ మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడైన బాల నేరస్తుడ్ని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు హత్యకు గురైన బాలుడి కుటుంబం, బంధువులు ఆ ప్రాంతంలో నిరసన తెలిపారు. మెకానిక్‌గా పని చేస్తున్న తన కుమారుడు పోలీస్ చెక్‌పోస్ట్ సమీపంలో హత్యకు గురయ్యాడని అతడి తండ్రి వాపోయాడు. ఈ ప్రాంతంలో 11వ హత్య అని, ప్రతి రెండు నెలలకు ఇక్కడ ఒక మర్డర్ జరుగుతున్నదని ఆరోపించాడు.
అయితే భారీగా వచ్చిన పోలీసులు నిరసన చేస్తున్న వారిని సముదాయించి అక్కడి నుంచి పంపివేశారు. బాలుడి హత్యపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ హత్యకు కారణంపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
cop dies of rabies | పోలీస్ అధికారిని రక్కిన కుక్క.. రేబిస్ సోకి మృతి
Jail For Cops | యువకుడి కస్టడీ డెత్‌పై కోర్టు సంచలన తీర్పు.. నలుగురు పోలీసులకు 11 ఏళ్లు జైలు శిక్ష
Boy Hides To Skip Tuition | ట్యూషన్‌కు వెళ్లకుండా దాక్కున్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?