లక్నో: ప్రియురాలి కుమారుడ్ని ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ప్రైవేట్ భాగాన్ని సర్జరీ చేయించుకోవాలని ఆ బాలుడ్ని బలవంతం చేశాడు. అతడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఠాకూర్గంజ్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ బట్టల షాపు నిర్వహిస్తున్నది. వ్యాపారి మంజూర్ హసన్ అలియాస్ సైఫీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ తన భర్తను వీడింది. కుమారుడితో పాటు సైఫీతో కలిసి నివసిస్తున్నది.
కాగా, ప్రియురాలి కుమారుడ్ని సైఫీ లైంగికంగా వేధించాడు. ప్రైవేట్ భాగాన్ని సర్జరీ చేయించుకోవాలని బలవంతం చేశాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడు తన తండ్రి వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు బాలుడి తండ్రి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలుడ్ని లైంగికంగా వేధిస్తున్న నిందితుడు సైఫీని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Boy Hides To Skip Tuition | ట్యూషన్‌కు వెళ్లకుండా దాక్కున్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Girls Locked In Toilet Of Madrassa | మదర్సా టాయిలెట్లో.. 40 మంది బాలికల నిర్బంధం
Watch: పార్కింగ్ ప్రాంతంలో ఎలుగుబంటి దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?