135 కోట్లకు టెలికాం సబ్‌స్ర్కైబర్లు.. టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ వెల్లడి
దేశవ్యాప్తంగా టెలికాం సబ్‌స్ర్కైబర్లు స్వల్పంగా పెరిగారు. జూన్ నెలకుగాను దేశవ్యాప్తంగా 134.8 కోట్ల మంది టెలికాం సబ్‌స్ర్కైబర్లు ఉన్నట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. దేశీయ టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్టెల్, జియో నెట్‌వర్క్‌లోకి కొత్తగా సబ్‌స్ర్కైబర్లు జతయ్యారని తెలిపింది.
న్యూఢిల్లీ, జూలై 28 : దేశవ్యాప్తంగా టెలికాం సబ్‌స్ర్కైబర్లు స్వల్పంగా పెరిగారు. జూన్ నెలకుగాను దేశవ్యాప్తంగా 134.8 కోట్ల మంది టెలికాం సబ్‌స్ర్కైబర్లు ఉన్నట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. దేశీయ టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్టెల్, జియో నెట్‌వర్క్‌లోకి కొత్తగా సబ్‌స్ర్కైబర్లు జతయ్యారని తెలిపింది. దీంట్లో ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి కొత్తగా 31.63 లక్షల మంది చేరారు. వీరిలో 29.89 లక్షల మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లు కాగా, 1.73 లక్షల ఫిక్స్డ్ లైన్ కనెక్షన్లు ఉన్నట్టు పేర్కొంది.
అలాగే రిలయన్స్ జియో లోకి 22.91 లక్షల సబ్‌స్ర్కైబర్లు చేరారు. వీరిలో 21.46 లక్షల మొబైల్ కస్టమర్లు కాగా, 1.44 లక్షల ఫిక్స్డ్ లైన్ సెగ్మెంట్నకు సంబంధించిన వారని తెలిపింది. మొత్తం సబ్‌స్ర్కైబర్లలో ఈ రెండు సంస్థలకు కలుపుకొని కొత్తగా 54.54 లక్షలు లేదా 87 శాతం ఉన్నారు. అలాగే వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లోకి 1.63 లక్షల మంది చేరగా, ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పరిధిలోకి 94 వేల మంది జతయ్యారు. కానీ, ఎంటీఎన్ఎల్ 11,284 మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లను కోల్పోయింది.
తెలుగు రాష్ర్టాల్లో పెరిగిన జియో వాటా
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో జియో తన మార్కెట్ వాటాను మరింత పెంచుకున్నది. జూన్ చివరి నాటికి వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్, 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్, యాక్టివ్ వైర్లెస్ సబ్‌స్ర్కైబర్లు భారీగా పెరిగినట్టు వెల్లడించింది. గత నెలలో కొత్తగా 1,78,546 నికర వైర్లెస్ సబ్‌స్ర్కైబర్లు చేరడంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 3.29 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

