Tirumala Brahmotsavams | సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనం
Tirumala Brahmotsavams | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavams ) ఏడో రోజు సోమవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనం( Surya Prabha Vahanam) పై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది.


భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు సకల జీవులకు ఆరోగ్యాన్ని, చైతన్యాన్ని ప్రసాదించే దివ్యశక్తికి ప్రతీక అని అర్చకులు తెలిపారు. సోమవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని వివరించారు . వాహనసేవలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
రేపు వైభవంగా రథోత్సవం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 7 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగనుందని టీటీడీ అధికారులు వివరించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

