‘అర్హులకు మాత్రమే జనరేటర్ స్కీం అమలు చేయాలి’
ముస్లిం మైనారిటీల్లో తురక కాశలు ఒక ప్రత్యేక వృత్తి సమాజంగా ఉన్నారని, వారి జీవనోపాధికి ఉపయోగపడే రాళ్లు కట్ చేసే మిషన్ జనరేటర్ స్కీంను ముస్లిం మైనార్టీలకు కాకుండా తురకకాశ ముస్లింలకు మాత్రమే వర్తించేలా అమలు చేయాలని తురకకాశ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు...
– తురకకాశ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బికారి డిమాండ్
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 21 : ముస్లిం మైనారిటీల్లో తురక కాశలు ఒక ప్రత్యేక వృత్తి సమాజంగా ఉన్నారని, వారి జీవనోపాధికి ఉపయోగపడే రాళ్లు కట్ చేసే మిషన్ జనరేటర్ స్కీంను ముస్లిం మైనార్టీలకు కాకుండా తురకకాశ ముస్లింలకు మాత్రమే వర్తించేలా అమలు చేయాలని తురకకాశ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బికారి డిమాండ్ చేశారు. బూర్గంపహాడ్ మండలంలోని అంజనాపురంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు షేక్ అజీజ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్ని మండలాల్లో తురక కాశ ముస్లింలు ఉండరని, ఏ మండలాల్లో తురకా కాశ ముస్లింలు ఉన్నారో ఆయా ప్రాంతాల్లో అర్హులైన కార్మికులకు మాత్రమే ప్రభుత్వం ఈ పథకాన్ని అందించాలన్నారు. ఇప్పటికే మంజూరైన జనరేటర్లు, రాళ్లు కట్ చేసే యంత్రాలు జిల్లాలో అర్హులైన కార్మికులకు అందించాలని కలెక్టర్, మైనార్టీ వెల్ఫేర్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి కమల్ వలీ, షేక్ ఖాసీం, హుస్సేన్, కరీం, చిన్న హుస్సేన్, నాగుల్‌మీరా, వజీర్, లాలూ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

