IIT Bombay | విద్యార్థి ఆత్మహత్య కేసు.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్ సస్పెండ్
IIT Bombay : ఐఐటీ బాంబేలో సాహిల్ వాంకోడే అనే విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లను యాజమాన్యం సస్పెండ్ చేసింది.
IIT Bombay : ఐఐటీ బాంబేలో సాహిల్ వాంకోడే అనే విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లను యాజమాన్యం సస్పెండ్ చేసింది. అంతేకాదు.. విద్యార్థి ఆత్మహత్యపై సరైన విచారణ ప్రారంభం కాకముందే దీనిపై ప్రకటన చేయడంపై కూడా ఐఐటీ బాంబే యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున ముందే ఒక నిర్ధరణకు రావడం సరికాదని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు ఐఐటీ బాంబే డైరెక్టర్ శిరీష్ బి కేదారే ఈ వివరాల్ని వెల్లడించారు. ఈ కేసుపై సాగుతున్న విచారణ అనంతరం అతడిపై పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐఐటీ బాంబేలో సెకండ్ ఇయర్ చదువుతున్న సాహిల్ వాకోడె అనే విద్యార్థి సెప్టెంబర్ 18న ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఆత్మహత్యపై వివాదం మొదలైంది. కుల వివక్ష, వేధింపుల కారణంగానే సాహిల్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదే సమయంలో అక్కడి విద్యార్థులు కూడా దీనిపై ఆందోళన బాటపట్టారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఐఐటీ బాంబే డైరెక్టర్ శిరీష్ బి కేదారె కూడా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఐఐటీ బాంబేలో పరీక్ష జరుగుతుండగా సాహిల్ వాంకోడె కాపీకి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. పరీక్ష జరుగుతున్న సమయంలో సూర్యనారాయణ ఇన్విజిలేటర్‌గా ఉన్నారు. సాహిల్‌ను పట్టుకున్న అనంతరం ఆయన పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు. అనంతరం హాస్టల్‌కు వెళ్లిన సాహిల్ అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ప్రొఫెసర్ వేధింపుల వల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు అక్కడి అధ్యాపక సంఘాలు మాత్రం ప్రొఫెసర్ సూర్యనారాయణకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై వివాదం నడుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

