బూర్గంపహాడ్, సెప్టెంబర్ 21 : బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులకు శుభ్రత, పరిశుభ్రతపై సర్పంచ్ బానోత్ సరోజ అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. మూత్ర, మల విసర్జనకు వెళ్లినా చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. భోజనానికి ముందు తర్వాత శుభ్రతను పాటించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రం చేయించి పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, ఎంపీడబ్ల్యూ వర్కర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.