లక్నో: హోంవర్క్ చేయకపోవడంతో ఒక బాలుడు ట్యూషన్‌కు వెళ్లలేదు. మేడపై ఉన్న గదిలో దాక్కున్నాడు. (Boy Hides To Skip Tuition) బాలుడు కనిపించకపోవడంతో అతడి కుటుంబం ఆందోళన చెందింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా చివరకు పోలీస్ డాగ్ అతడ్ని పసిగట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. పదేళ్ల లక్ష్య ప్రతాప్ సింగ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత అతడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాలుడ్ని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు వెంటనే స్పందించారు. బాలుడు ప్రతాప్ సింగ్ ఫొటోను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపి అలెర్ట్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పోలీసులు తనిఖీ చేశారు. నాలుగు గంటలపాటు వెతికినా ఎక్కడా ఆ బాలుడి జాడ కనిపించలేదు.
మరోవైపు ఎస్పీ జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ డాగ్ స్క్వాడ్‌ను పిలిపించారు. ఏడేళ్ల డోబర్మ్యాన్ అయిన స్నిఫర్ డాగ్ ‘టోనీ’కి బాలుడి చొక్కా ఇచ్చారు. దీంతో నిమిషాల్లోనే అతడ్ని పసిగట్టింది. ఆ బాలుడి ఇంట్లోకి పరుగెత్తింది. మెట్లమీదకు వెళ్లింది. అక్కడ లోపల నుంచి లాక్ వేసి ఉన్న గది బయట అది మొరిగింది.
కాగా, పోలీసులు ఆ గదిని బలవంతంగా తెరిచారు. ఆ గది లోపల ఒక మూల నిద్రపోతూ బాలుడు ప్రతాప్ సింగ్ కనిపించాడు. నిద్ర లేచిన అతడు హోంవర్క్ చేయకపోవడంతో ట్యూషన్ ఎగ్గొట్టేందుకు అక్కడ దాక్కున్నట్లు తెలిపాడు. టీచర్ వెళ్లిన తర్వాత బయటకు రావాలని అనుకున్నానని, అయితే నిద్ర రావడంతో అక్కడ పడుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. ఆ బాలుడ్ని కుటుంబ సభ్యులకు పోలీస్ అధికారి అప్పగించారు. అతడ్ని త్వరగా గుర్తించిన పోలీస్ డాగ్ టోనీని అందరూ ప్రశంసించారు.
Also Read:
Watch: టెక్కీ ముఖంపై కారం పొడి చల్లి.. అతడి మూడేళ్ల కుమారుడు కిడ్నాప్
Girls Locked In Toilet Of Madrassa | మదర్సా టాయిలెట్లో.. 40 మంది బాలికల నిర్బంధం