లక్నో: మద్యానికి బానిసైన వ్యక్తిని పునరావాస కేంద్రానికి కుటుంబం పంపింది. అయితే అక్కడ స్పూన్లు, బ్రష్‌లు తినేందుకు అతడు అలవాటుపడ్డాడు. (Man Eats Spoons, Tooth brushes) చివరకు కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో చేరాడు. పరీక్షించిన డాక్టర్లు అతడి కడుపులో స్పూన్లు, బ్రష్‌లు ఉన్నట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. హాపూర్‌కు చెందిన 35 ఏళ్ల సచిన్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతడి కుటుంబం మద్యం మాన్పించేందుకు డీ అడిక్షన్ సెంటర్లో చేర్చారు.
కాగా, ఆ పునరావాసం కేంద్రంలో సచిన్‌కు తక్కువ ఆహారం ఇచ్చేవారు. దీంతో ఆకలికి తట్టుకోలేక స్పూన్లు, బ్రష్‌లు, పెన్నులు దొంగిలించి వాటిని మింగేవాడు. ఈ నేపథ్యంలో కడుపు నొప్పితో బాధపడటంతో సచిన్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ఎక్స్ రే, సీటీ స్కాన్‌లో అతడి కడుపులో స్పూన్లు, టూత్ బ్రష్‌లు, పెన్నులు ఉండటం చూసి డాక్టర్లు షాక్ అయ్యారు.
మరోవైపు సచిన్ కడుపులో ఉన్న వాటిని తొలుత ఎండోస్కోపీ ద్వారా తొలగించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. అయితే సాధ్యం కాకపోవడంతో సర్జరీ చేశారు. 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్‌లు, రెండు పెన్నులను సచిన్ కడుపు నుంచి తొలగించినట్లు డాక్టర్ శ్యామ్ కుమార్ తెలిపారు. మానసిక రుగ్మతలు ఉన్న వారిలో ఇలాంటివి జరుగుతుంటాయని వెల్లడించారు.
Also Read:
Wife Bites Off Husband’s Ear | భర్తను కొట్టి చెవి కొరికిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు
Top Cop’s Phones Snatched | ఐజీ చేతి నుంచి.. మొబైల్ ఫోన్లు లాక్కెళ్లిన దొంగలు
Watch: టెక్కీ ముఖంపై కారం పొడి చల్లి.. అతడి మూడేళ్ల కుమారుడు కిడ్నాప్