భోపాల్: పోలీస్ ఉన్నతాధికారి అయిన ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) చేతిలో ఉన్న రెండు మొబైల్ ఫోన్లను బైక్పై వచ్చిన దొంగలు లాక్కెళ్లారు. (Top Cop’s Phones Snatched) సున్నితమైన సమాచారం ఉన్న ఆ మొబైల్ ఫోన్లు హై సెక్యూరిటీ ఏరియాలో చోరీ కావడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. ఇంటెలిజెన్స్, ఏటీఎస్ ఐజీ ఆశిష్ మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భోజనం తర్వాత తన భార్యతో కలిసి వాకింగ్ చేస్తున్నారు. అత్యంత భద్రత ఉండే చార్ ఇమ్లి జోన్ ప్రాంతంలోకి బైక్పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన చేతిలో ఉన్న రెండు మొబైల్ ఫోన్లు లాక్కొని పారిపోయారు.
కాగా, ఐజీ ఆశిష్ నుంచి చోరీ అయిన ఆ మొబైల్ ఫోన్లలో పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన సున్నితమైన సమాచారం ఉన్నది. దీంతో ఈ విషయం తెలిసి పోలీస్ ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. అయితే ఒక మొబైల్ ఫోన్లో అడ్వాన్స్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నట్లు తెలుసుకున్న దొంగలు కొన్ని నిమిషాల్లోనే ఒకచోట దానిని పడేశారు. దీంతో ట్రాకింగ్ ద్వారా ఆ మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నట్లు భావిస్తున్న రెండో మొబైల్ ఫోన్ను పోలీసులు ఇంకా గుర్తించలేదు. పలు పోలీస్ స్టేషన్లకు చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీని కోసం వెతుకుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇద్దరు అనుమానితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Also Read:
Watch: బీచ్లో చిక్కుకున్న స్కార్పియో.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: గర్బా నృత్యం ప్రాక్టీస్ చేస్తున్న మహిళను కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే?