ముంబై: సముద్రం ఒడ్డున ఉన్న బీచ్‌లో స్కార్పియో కూరుకుపోయింది. (Scorpio Stuck In Beach) అక్కడ చిక్కుకున్న ఆ వాహనాన్ని పెద్ద అలులు చుట్టుముట్టాయి. దీంతో ఆ స్కార్పియో సముద్రంలోకి కొట్టుకెళ్లబోయింది. అయితే స్థానికుల సహాయంతో దానిని ఒడ్డుకు లాగారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని వాసాయిలో ఈ సంఘటన జరిగింది. ముంబై నుంచి 75 కిలోమీటర్ల దూరంలోని కలంబ్ బీచ్‌కు ఆదివారం కొందరు పర్యాటకులు స్కార్పియోలో వెళ్లారు.
కాగా, బీచ్ నుంచి సముద్రం తీరంలోని కొంత దూరం వరకు ఆ స్కార్పియోను నడిపారు. ఈ నేపథ్యంలో అక్కడున్న ఇసుకలో అది చిక్కుకున్నది. ఇంతలో భారీ అలలు వచ్చాయి. దీంతో ఆ స్కార్కియో మెల్లగా సముద్రంలోకి కొట్టుకుపోసాగింది. అందులో ఉన్న వారు సహాయం కోసం కేకలు వేశారు.
మరోవైపు ఆ బీచ్‌లోని స్థానికులు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. స్కార్పియోకు తాడు కట్టి బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా సముద్రపు అలలు, వారి మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగింది. చివరకు వారంతా శ్రమించి ఆ వాహనాన్ని సముద్రం నుంచి బీచ్ ఒడ్డుకు లాక్కొచ్చారు. అందులోని వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపటడంతో వారికి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:
Rat In IndiGo flight | ఇండిగో విమానంలో ఎలుక.. మూడు గంటలు ఆలస్యంగా టేకాఫ్
Ship Catches Fire | సొమాలియా వెళ్లే నౌకలో మంటలు.. లోడ్ చేసిన బియ్యం బస్తాలు ఆహుతి