పాట్నా: ఐదుగురు వ్యక్తులు ప్రయాణించిన ఎస్యూవీ రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గుంతలో పడింది. (SUV Falls Into Pothole) నీటితో నిండిన ఆ గుంతలో ఒక పక్కకు అది పూర్తిగా ఒరిగిపోయింది. అయితే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రగా అధికారి పేర్కొన్నట్లు యజమానురాలు ఆరోపించింది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 19న రాత్రి వేళ ఐదుగురు వ్యక్తులు ప్రయాణించిన ఎస్యూవీ పాట్నా రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పెద్ద గుంతలో పడిపోయింది. ఒక పక్కకు ఒరిగి పడిన బ్లాక్ స్కార్పియో ఆ గుంతలోని నీటిలో సగానికిపైగా మునిగింది. అయితే అందులోని వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మరునాడు ఉదయం దీనిని చూసేందుకు స్థానికులు గుమిగూడారు.
కాగా, ఆ వాహనాన్ని డ్రైవ్ చేసిన యజమానురాలైన నీతూ సింగ్ చౌబే మీడియాతో మాట్లాడారు. ‘ప్రతి ఒక్కరినీ మేం సంప్రదించాం. డీఎంతో మాట్లాడాం. ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి జరిగిన కుట్ర అని ఆయన అన్నారు’ అని ఆమె ఆరోపించారు.
మరోవైపు బీహార్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్దే తప్పు అని నీతూ సింగ్ విమర్శించారు. ‘అధికారులు 20 రోజుల కిందట ఇక్కడ తవ్వి వదిలేశారు. వర్షం వల్ల ఆ గుంత నీటితో నిండింది. కారులో ఉన్న ఐదుగురిలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఎవరిది బాధ్యత?’ అని ఆమె ప్రశ్నించారు.
కాగా, ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయలేదని, మరో వ్యక్తి బైక్ కూడా ఇందులో పడిందని నీతూ సింగ్ మండిపడ్డారు. ఇక్కడ ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారని ఆమె అన్నారు. మరోవైపు రోడ్డు మధ్యలో తవ్విన పెద్ద గుంతలో ఎస్యూవీ పడిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
SHOCKER 🚨 A Mahindra Scorpio-N fell into a large, water-filled pothole near Patna Junction 😳
SUV’s WOMAN OWNER : “It is a conspiracy to defame the NDA Government during the election season” pic.twitter.com/P6mI9HFEmQ
— Times Algebra (@TimesAlgebraIND) September 22, 2025
Forget Metros and Flyovers, Bihar Masters Instant Underground Passages
While most Indian cities struggle with potholes and craters, Bihar appears to have gone a step further here the roads hide unseen “tunnels” that can open up anytime, anywhere. In a shocking incident near… pic.twitter.com/1EaOchTjgM
— Karnataka Portfolio (@karnatakaportf) September 21, 2025
#WATCH | Patna, Bihar: Car owner Nitu Singh Choubey says, “Everyone has been contacted. We spoke with the DM. This is a conspiracy to defame the government during the election period. This is all BUIDCO’s fault. They created a pothole on the road and left it for 20 days. It’s the… https://t.co/sgC9kuumNX pic.twitter.com/qFI2GlO8s7
— ANI (@ANI) September 19, 2025
Also Read:
Air India Plane | ఎక్కని ప్రయాణికుడు.. వెనక్కి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం
Ship Catches Fire | సొమాలియా వెళ్లే నౌకలో మంటలు.. లోడ్ చేసిన బియ్యం బస్తాలు ఆహుతి