న్యూఢిల్లీ/ లండన్: బోర్డింగ్ పాస్ జారీ చేసిన ఒక ప్రయాణికుడు విమానం ఎక్కలేదు. (Air India Plane) ఆ విమానం టేకాఫ్ కోసం ట్యాక్సీవే వద్దకు వెళ్తుండగా సిబ్బంది ఈ విషయాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానాన్ని తిరిగి వెనక్కి తెచ్చారు. సెప్టెంబర్ 21న లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం షెడ్యూల్ కంటే 45 నిమిషాలు ఆలస్యమైంది.
కాగా, టేకాఫ్ కోసం ఏఐ 162 విమానం టాక్సీవే వైపు వెళ్లింది. ఇంతలో బోర్డింగ్ పాస్ జారీ చేసిన ఒక ప్రయాణికుడు విమానం ఎక్కలేదని సిబ్బంది దృష్టికి వచ్చింది. దీంతో ఆ విమానాన్ని తిరిగి ఎయిర్పోర్ట్ టెర్మినల్ వద్దకు మళ్లించారు.
మరోవైపు ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రయాణికుడి లగేజ్‌ను ఆఫ్‌లోడ్ చేయడానికి విమానం వెనక్కి వచ్చిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఆ తర్వాత కొంత ఆలస్యంగా హీత్రూ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్లు చెప్పారు.
కాగా, బోర్డింగ్ పాస్ స్కాన్ చేసిన తర్వాత ఆ ప్రయాణికుడు పొరపాటున డిపార్చర్ గేటు వైపు కాకుండా ఎరైవల్స్ గేట్ వద్దకు వెళ్లినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి వివరించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడ్ని ప్రశ్నించేందుకు ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read:
Ship Catches Fire | సొమాలియా వెళ్లే నౌకలో మంటలు.. లోడ్ చేసిన బియ్యం బస్తాలు ఆహుతి
Woman Dies By Suicide | హత్యకు గురైన ప్రియుడు.. ప్రియురాలు ఆత్మహత్య
Lankan Woman | ఎల్టీటీఈ పునరుద్ధరణకు యత్నం.. శ్రీలంక మహిళపై ఈడీ దర్యాప్తు
Unnatural Act With Cow | ఆవు పట్ల అసహజ ప్రవర్తన.. వ్యక్తి మెడలో చెప్పుల దండ వేసి ఉరేగింపు