లక్నో: ప్రియుడు హత్యకు గురయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రియురాలు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. (Woman Dies By Suicide) ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిల్కానా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల అంకిత, 22 ఏళ్ల మహిల్ ప్రేమించుకున్నారు. అయితే శుక్రవారం మహిల్ హత్యకు గురయ్యాడు. అంకిత కుటుంబ సభ్యులు తమ కుమారుడ్ని చంపినట్లు అతడి కుటుంబం ఆరోపించింది. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
కాగా, అంకిత ఇద్దరు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిల్ హత్యపై వారిని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రియుడు హత్యకు గురికావడంపై అంకిత మనస్తాపం చెందింది. ఈ నేపథ్యంలో శనివారం ఇంట్లో పురుగుమందు సేవించి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అంకిత మృతదేహం సమీపంలో పడి ఉన్న పురుగుమందు ఖాళీ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం యువతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Lankan Woman | ఎల్టీటీఈ పునరుద్ధరణకు యత్నం.. శ్రీలంక మహిళపై ఈడీ దర్యాప్తు
Unnatural Act With Cow | ఆవు పట్ల అసహజ ప్రవర్తన.. వ్యక్తి మెడలో చెప్పుల దండ వేసి ఉరేగింపు