భోపాల్: ఒక వ్యక్తి ఆవు పట్ల అసహజంగా ప్రవర్తించాడు. (Unnatural Act With Cow) ఇది గమనించిన కొందరు వ్యక్తులు హిందూ సంస్థ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు. మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 9న నలఖేడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 55 ఏళ్ల మొహమ్మద్ షాహిద్, ఈద్గా సమీపంలో ఆవు పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.
కాగా, ఇది చూసిన కొందరు స్థానికులు హిందూ సంస్థ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆవు పట్ల అనుచితంగా ప్రవర్తించిన షాహిద్ మెడలో బలవంతంగా చెప్పుల దండ వేశారు. అతడ్ని ఆ ప్రాంతంలో ఊరేగించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మొహమ్మద్ షాహిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. జంతువులపై క్రూరత్వం నివారణ చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడ్ని రిమాండ్‌కు తరలించారు. అయితే పోలీసుల సమక్షంలో నిందితుడి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించినట్లు వచ్చిన ఆరోపణలను పోలీస్ అధికారి ఖండించారు.
Also Read:
Watch: బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కింద పడిన వ్యాపారవేత్త.. వీడియో వైరల్