ఇంఫాల్: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. (Attack On Assam Rifles Convoy ) ఒక వాహనంలో ఉన్న వ్యక్తులు భద్రతా సిబ్బంది కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఇటీవల ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించిన రోడ్డు మార్గంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 5.50 గంటల సమయంలో ఇంఫాల్ శివారులోని జాతీయ రహదారిపై వెళ్తున్న అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై మెరుపు దాడి జరిగింది. ఒక వ్యాన్‌లో వచ్చిన వ్యక్తులు గన్స్‌తో కాల్పులు జరిపి పారిపోయారు. అస్సాం రైఫిల్స్‌కు చెందిన నాయిబ్ సుబేదార్ శ్యామ్ గురుంగ్, రైఫిల్‌మ్యాన్ రంజిత్ సింగ్ కశ్యప్ ఈ కాల్పుల్లో మరణించారు. మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. వారిని ఇంఫాల్‌లోని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ కాల్పులకు సంబంధించి మణిపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మెరుపు దాడిలో వినియోగించినట్లు అనుమానిస్తున్న వ్యాన్‌ను ఇంఫాల్‌లోని ముతుమ్ యాంగ్బీ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనానికి చాలా మంది యజమానులు ఉన్నారని, వారందరినీ గుర్తించినట్లు చెప్పారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీనియర్ పోలీస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. నేరస్థులను త్వరగా గుర్తించేందుకు అన్ని భద్రతా సంస్థల మధ్య సమన్వయం అవసరమని చర్చించారు. అలాగే రహదారులు, రవాణా మార్గాలు, సరిహద్దు మండలాలు వంటి సున్నితమైన ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు.
Also Read:
British-era silver coins | ఆలయ పునరుద్ధరణ కోసం తవ్వకాలు.. బయటపడిన బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు
Man Slits Wife Throat | భార్యతో రాజీ కోసం 175 కిలోమీటర్లు ప్రయాణించి.. ఆమె గొంతు కోసిన భర్త