భువనేశ్వర్: భార్యతో రాజీ కోసం ఒక వ్యక్తి ప్రయత్నించాడు. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె వద్దకు చేరుకున్నారు. అయితే వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు బహిరంగంగా ఆమె గొంతు కోశాడు. (Man Slits Wife Throat) అప్రమత్తమైన స్థానికులు అతడ్ని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కుటుంబ గొడవల వల్ల షేక్ అమ్జాద్ అతడి భార్య విడిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
కాగా, భార్యతో రాజీపడాలని షేక్ అమ్జాద్ భావించాడు. దీంతో కటక్ నుంచి 175 కిలోమీటర్లు ప్రయాణించి బాలాసోర్ చేరుకున్నాడు. అక్కడ తన భార్యను కలిశాడు. ఆమెను రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు. భార్య ముఖం పట్టుకుని మాట్లాడాడు. ఉన్నట్టుండి ఆమె జుట్టు పట్టుకున్నాడు. వెంట తెచ్చిన కత్తితో భార్య గొంతు కోశాడు.
మరోవైపు ఇది చూసిన స్థానికులు షాక్ అయ్యారు. భార్యపై కత్తితో దాడి చేసిన అమ్జాద్‌ను పట్టుకున్నారు. అతడ్ని కొట్టి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన మహిళను బాలాసోర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కటక్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో అక్కడకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆమె భర్తను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు రోడ్డుపై వెళ్లే వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన భార్యపై భర్త కత్తి దాడి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:
Woman Stabs Boyfriend | పెళ్లి విషయంపై గొడవ.. ప్రియుడ్ని కత్తితో పొడిచి చంపిన మహిళ
Shooting at Lucknow mall | లక్నో మాల్ వద్ద కాల్పులు.. నలుగురు అరెస్ట్
Chinese grenades | జమ్ముకశ్మీర్‌లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం.. ఉగ్రవాద కుట్ర భగ్నం
Watch: అర్ధరాత్రి వేళ ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతులు.. వీడియో వైరల్