న్యూఢిల్లీ: అర్ధరాత్రి వేళ ఆకాశంలో కాంతి పుంజాలు కనిపించాయి. ప్రకాశవంతంగా మండుతున్న గీతలను చూసి జనం ఆశ్చర్యపోయారు. (Fiery Streak) ఉల్కాపాతమా లేక అంతరిక్ష శిథిలాలా? అన్నది అర్థం కాలేదు. ఈ కాంతి వెలుగుల వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో ఆకాశంలో కాంతి పుంజాలు కనిపించాయి. మండుతున్న గీతల మాదిరిగా దూసుకొచ్చాయి. ఆకాశంలో మెల్లగా వెళ్తున్న చిన్న చిన్న లైట్ల మాదిరిగా కొంతసేపు కనువిందు చేశాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్ ప్రాంతాల్లో ఇవి కనిపించాయి. నైట్ షిఫ్ట్‌ల తర్వాత ఇళ్లకు వెళ్లే వారు వీటిని చూసి ఆశ్చర్యపోయారు.
కాగా, ప్రకాశవంతమైన ఈ కాంతి వెలుగులు ఉల్కాపాతమా లేదా అంతరిక్ష శిథిలాలా అన్నది అర్థం కాలేదు. ఇవి ఉల్కాపాతమని చాలామంది భావించారు. అయితే చైనాకు చెందిన సీజెడ్-3బీ రాకెట్ శకలాలు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు ఇలా మండినట్లు గ్రోక్ పేర్కొంది. కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ కాంతి పుంజాల వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
New Delhi witnessed a spectacular celestial event on Friday night when bright debris lit up the skies, leaving residents in awe and sparking a wave of excitement online.pic.twitter.com/FCxk1kWFXD
— Massimo (@Rainmaker1973) September 20, 2025
Just witnessed this incredible fire streak in the night sky
Looks like a meteor or maybe part of a rocket burning up in the atmosphere nature’s own light show from my rooftop.
Did anyone else spot it too?#noida #delhi #Meteor #NightSky @isro @NASA pic.twitter.com/tQYs27WWrC— Ujjwal Yadav (@ujjwal1710) September 19, 2025
Also Read:
DK Shivakumar | ‘ప్రకృతి వల్లే గుంతలు’.. బెంగళూరు రోడ్లపై డీకే శివకుమార్
Residents, Cops Face Off | బెంగళూరులో గుంతల రోడ్లపై జనం నిరసన.. పోలీసులతో ఘర్షణ
Woman Stabs Boyfriend | పెళ్లి విషయంపై గొడవ.. ప్రియుడ్ని కత్తితో పొడిచి చంపిన మహిళ