బెంగళూరు: గుంతలమయంగా మారిన బెంగళూరు రోడ్ల గురించి నివాసితులు నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసన నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. (Residents, Cops Face Off) కర్ణాటక రాజధానిలో ఈ సంఘటన జరిగింది. బెంగళూరు రోడ్లు గుంతలమయంగా మారాయి. దీంతో పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల సమస్యను అధికారుల దృష్టికి జనం తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోవడం లేదు.
కాగా, శనివారం ఉదయం బెంగళూరులోని పలు చోట్ల కాలనీవాసులు నిరసన తెలిపారు. ఐటీ నగరంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై ఆందోళన చేపట్టారు. ‘బెంగళూరు రోడ్లను కాపాడండి’, ‘రోడ్లను బాగుచేయండి’ అన్న ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
మరోవైపు పోలీసులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. నిరసనలకు అనుమతి లేదని తెలిపారు. నిరసనలు ఆపాలని కాలనీవాసులను డిమాండ్ చేశారు. నిరసన ముగించకపోతే అరెస్టు చేస్తామని వారిని పోలీసులు బెదిరించారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు, పోలీసుల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
In #Bengaluru
Apartments residents appeal for ‘ROADS’ as the Varthur-Gunjur Road, with potholes and craters coupled with crawling traffic, makes commute a nightmare. Most of the residents are techies who fix glitches globally.@timesofindia pic.twitter.com/01ZtI9g28P
— TOI Bengaluru (@TOIBengaluru) September 20, 2025
Standoff in the IT corridor between residents and cops for protesting over poor infrastructure in their area.
Residents tried to hold silent protests outside apartments demanding better roads, cops stopped protestors citing lack of permission. Visuals from Lakeside Habitat apt. pic.twitter.com/4HUYZvz76C— Deepak Bopanna (@dpkBopanna) September 20, 2025
Also Read:
Watch: నిందితుడి అరెస్ట్‌కు పోలీసులు యత్నం.. దాడి చేసిన అతడి బంధువులు
Watch: బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కింద పడిన వ్యాపారవేత్త.. వీడియో వైరల్
Watch: విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ