న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భారత్లో అత్యంత వేగవంతమైన మెట్రో రైల్ సేవలు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 82 కి.మీ ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్), 28 కి.మీ మీరట్ మెట్రో మిగిలిన ప్రాంతాల సర్వీసులను ప్రారంభించారు.
ఇది ఢిల్లీ ఎన్సీఆర్తో చుట్టు పక్కల రాష్ర్టాలకు అనుసంధానాన్ని పెంచుతుందని, ప్రాంతీయ నగరాలకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని తెలిపారు. మెట్రో ప్రారంభించాక ఆయన శతాబ్ది నగర్ నుంచి మీరట్ సౌత్ వరకు కొత్త మెట్రో రైల్లో ప్రయాణించారు.
ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎన్సీఆర్ అధికారులు ఉన్నారు. గంటకు 180 కి.మీ వేగంతో నడిచేలా తయారు చేసిన మీరట్ మెట్రో మార్గంలో 160 కి.మీ వేగంతో రైళ్లను నడుపుతారు. ఈ వేగం వల్ల మెట్రోతో ఢిల్లీ, అర్బన్ ప్రాంతాలైన షాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్, మీరట్ల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది.