హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రెండేండ్లుగా తాము అనేకసార్లు ఈ విషయంపై హెచ్చరించామని, ఇప్పుడు రేవంత్‌రెడ్డే నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర సంపదను కాం గ్రెస్ అధిష్ఠానానికి ధారపోస్తూ, తెలంగా ణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పాలనను దండుపాళ్యం ముఠా తీరుతో పోల్చిన కేటీఆర్.. తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవడం..
తన పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి సంచులు మోయడమే సీఎం రేవంత్ఏకై క అజెండా అని ధ్వజమెత్తారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుతోపాటు అభివృద్ధి పనులకూ ప్రభుత్వం వద్ద రూ పాయి నిధుల్లేవంటూ సాకులు చెప్తున్నారని విమర్శించారు. ఈ రెండేండ్ల కాలంలోనే కాంగ్రెస్ సర్కార్ రూ.3 లక్షల కోట్ల మేరకు భారీగా అప్పులు తెచ్చిందని తెలిపారు. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధి కోసం కనీసం ఒక ఇటుక కూడా పేర్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ప్రజల సొమ్మును ప్రజా ప్రయోజనాలకు వాడకుండా పకదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో సాగుతున్న భూ దోపిడీపైనా కేటీఆర్ స్పందించారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను, లగచర్ల సహా పలుచోట్ల గిరిజనుల భూములను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములనూ రేవంత్ సర్కార్ వదలడం లేదని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ పేరిట పరిశ్రమల భూములను అనుముల బ్రదర్స్ కలిసి అంబుక పడుతున్నారని, ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర వనరులను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కష్టార్జితాన్ని దారిమళ్లిస్తూ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ కోరారు.