న్యూఢిల్లీ: వారెంట్ జారీ అయిన నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తితోపాటు అతడి బంధువులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా పోలీసులపై దాడి చేశారు. (Cops Attacked) ఈ ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఒక కేసులో నిందితుడైన అజామ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. దీంతో మంగళవారం ఫతేపూర్ బేరి ప్రాంతంలో అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.
కాగా, అజామ్, అతడి బంధువులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు. వారిని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అదనపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అజామ్‌తోపాటు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు దాడిలో గాయపడిన పోలీసుల వాంగ్మూలాల ఆధారంగా అజామ్, అతడి బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన మిగతా వారి కోసం వెతుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, పోలీసులపై దాడికి సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#DelhiPolice पीट गई बदमाश भी भाग गया। @DelhiPolice @DCPSouthDelhi की टीम फतेहपुरी बेरी के चंदन होला में घोषित बदमाश आजम के खिलाफ गैरजमानती वारंट तामील कराने गई थी।बदमाश ने रिश्तेदारों की मदद से पुलिस पर हमला करवा दिया और फरार हो गया। घायल पुलिस एम्स में। मुकदमा दर्ज हो गया है। pic.twitter.com/jNqzp5UK5C
— ALOK VERMA (@alokvermajourno) September 17, 2025
Also Read:
lawyers thrashed cops | పోలీస్ అధికారిని చుట్టుముట్టి న్యాయవాదులు దాడి.. కోర్టు ప్రాంగణంలో ఘటన
Teacher Thrashes Students | కాళ్ల మీదపడి మొక్కనందుకు.. విద్యార్థులను కర్రతో కొట్టిన టీచర్
Gay Dating App | గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. బాలుడిపై 16 మంది లైంగికదాడి