భువనేశ్వర్: కాళ్ల మీదపడి మొక్కనందుకు విద్యార్థులపై టీచర్ ఆగ్రహించింది. కర్రతో వారిని చితకబాదింది. (Teacher Thrashes Students) దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉదయం ప్రభుత్వ స్కూల్కు వచ్చిన విద్యార్థులు ప్రార్థన తర్వాత తమ క్లాసులకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా కొందరు స్టూడెంట్స్ గౌరవ సూచికంగా తన కాళ్లపై పడి నమస్కరించనందుకు ఒక టీచర్ ఆగ్రహించింది. ఆరు నుంచి ఎనిమిది తరగతులకు చెందిన 31 మంది విద్యార్థులను బెత్తంతో దారుణంగా కొట్టింది. ఒక బాలుడు, ఒక బాలికతోసహా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ప్రభుత్వ స్కూల్కు చేరుకున్నారు. ఆ ఉపాధ్యాయురాలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు స్కూల్ హెడ్మాస్టార్ ఈ సంఘటన గురించి స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో బీఈవో, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యుడితో కూడిన బృందం ఆ స్కూల్కు చేరుకుని విచారణ జరిపారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.
Also Read:
lawyers thrashed cops | పోలీస్ అధికారిని చుట్టుముట్టి న్యాయవాదులు దాడి.. కోర్టు ప్రాంగణంలో ఘటన
Gay Dating App | గే డేటింగ్ యాప్లో పరిచయం.. బాలుడిపై 16 మంది లైంగికదాడి
Protesters Garland Potholes | ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి.. గుంతలకు దండలు వేసి నిరసన