లక్నో: కోర్టు విచారణకు హాజరైన ఒక పోలీస్ అధికారిని న్యాయవాదులు చుట్టుముట్టారు. ఆయనపై పంచులిచ్చి కొట్టారు. (lawyers thrashed cops) ఆ పోలీస్ అధికారితోపాటు ఆయన వెంట ఉన్న కానిస్టేబుల్ కూడా లాయర్ల దాడిలో గాయపడ్డాడు. వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. బరగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భూ వివాదంలో ఒక న్యాయవాదితో సహా రెండు వర్గాలపై 37 ఏళ్ల ఎస్ఐ మిథిలేష్ ప్రజాపతి చలాన్లు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆ పోలీస్ అధికారి తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడి చేసినట్లు ఆ లాయర్ ఆరోపించాడు.
కాగా, మంగళవారం కోర్టు విచారణ కోసం ఎస్ఐ మిథిలేష్ ప్రజాపతి కానిస్టేబుల్ రాణా ప్రసాద్‌తో కలిసి వారణాసి కోర్టుకు హాజరయ్యారు. అయితే న్యాయవాదిపై దాడి చేసిన ఆయనపై ప్రతీకారం కోసం కొందరు న్యాయవాదులు గుంపుగా వేచి ఉన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ పోర్టికో సమీపంలో పోలీస్ అధికారి మిథిలేష్ ప్రజాపతిని చుట్టుముట్టి కొట్టారు. పారిపోతున్న ఆయన వెంటపడి పంచులిచ్చారు.
మరోవైపు స్పృహ కోల్పోయిన ఆ ఎస్ఐను ఒక కార్యాలయంలోకి న్యాయవాదులు ఈడ్చుకెళ్లారు. అక్కడ తిరిగి దాడి కొనసాగించారు. కొంతసేపు బంధించారు. కోర్టులోని మిగతా పోలీసులు జోక్యం చేసుకుని ఎస్ఐ మిథిలేష్ ప్రజాపతిని కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్లారు. న్యాయవాదుల గుంపు దాడిలో ఎస్ఐ మిథిలేష్ ప్రజాపతితో పాటు ఆయన వెంట ఉన్న కానిస్టేబుల్ రాణా ప్రసాద్ కూడా గాయపడ్డాడు. వారిద్దరిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఎస్ఐ మిథిలేష్ ప్రజాపతికి 16 కుట్లు పడటంతోపాటు అంతర్గతంగా గాయాలయ్యాయి. ఆయన ఫిర్యాదుపై పది మంది న్యాయవాదులతో పాటు గుర్తు తెలియని సుమారు 60 మంది లాయర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీస్ అధికారిపై న్యాయవాదులు గుంపుగా దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Varanasi Court: Lawyers chased and brutally beat up police officers — a constable and inspector seriously injured, now in trauma care.
FIR filed against over 50 lawyers, including 10 named.#Varanasi #LawAndOrder #BreakingNews pic.twitter.com/jO5knpyzio— Shubham Yadav (@Shubhamsaying) September 17, 2025
Also Read:
Gay Dating App | గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. బాలుడిపై 16 మంది లైంగికదాడి
Protesters Garland Potholes | ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి.. గుంతలకు దండలు వేసి నిరసన
Watch: ఎలుగుబంటికి కూల్ డ్రింక్ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?