రాయ్‌పూర్: ఒక యువకుడు సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించాడు. ఎలుగుబంటి ఉన్న చోటుకు అతడు వెళ్లాడు. దాని వద్ద కూల్ డ్రింక్ ఉంచాడు. ఆ డ్రింక్ బాటిల్ తీసుకున్న ఎలుగుబంటి దానిని తాగింది. (Cold Drink To Bear) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో రీల్ కోసం ఒక యువకుడు సాహసం చేశాడు. నారా గ్రామంలోని వన్యప్రాణుల కేంద్రంలో ఒక ఎలుగుబంటి వద్దకు వెళ్లాడు. దాని ముందు డ్రింక్ బాటిల్ ఉంచాడు. ఎలుగుబంటి ఆ బాటిల్ తీసుకుని అందులో ఉన్న డ్రింక్ తాగింది.
కాగా, రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో యువత రీల్ పిచ్చి, వన్యప్రాణుల భద్రత, ఆ చట్టాల ఉల్లంఘనపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ యువకుడి నిర్లక్ష్యంపై కొందరు మండిపడ్డారు. ఆ ఎలుగుబంటి దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే ఎలుగుబంటి ఆరోగ్యానికి కూల్ డ్రింక్స్ హానికరమని మరి కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ రీల్ రికార్డ్ చేసిన యువకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
VIDEO : रील के चक्कर में भालू को पिला दी कोल्ड ड्रिंक, वीडियो हुआ सोशल मीडिया पर वायरल
छत्तीसगढ़ के कांकेर का है मामला#Chhattisgarh #Kanker #ViralVideo #Bhalu #beardstyle #cold #reel #Kanker #BreakingNews #Bear #Wildlife #trending #viral #cgreels #bastar pic.twitter.com/zcjV5F5XOz
— The news (@Thenews0fficial) September 12, 2025
Also Read:
Asaduddin Owaisi | 26 మంది ప్రాణాల కంటే డబ్బు విలువైనదా?.. భారత్, పాక్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఆగ్రహం
Couple Kills Children, Plan To Suicide | సూసైడ్ ప్లాన్‌లో పిల్లలు, భర్త మృతి.. బతికిన భార్య
Earthquake | అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. ఉత్తర బెంగాల్, భూటాన్‌లో ప్రకంపనలు
Tale Of Two Bengal Doctors | వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. జూనియర్ డాక్టర్ అరెస్ట్