గౌహతి: అస్సాంలో భూకంపం సంభవించింది. (Earthquake) ఆదివారం సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని గౌహతిపైనా ప్రభావం చూపింది. దీంతో భవనాల్లో నిసించే జనం భయంతో బయటకు పరుగులుతీశారు. అస్సాంలోని ఉదల్గురి జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడినట్లు చెప్పారు. గౌహతితోపాటు ఉత్తర బెంగాల్, భూటాన్‌లో భూ ప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదు కాలేదని తెలిపారు.
కాగా, దేశంలో తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అస్సాం కూడా ఉన్నది. యురేషియన్ ప్లేట్ కింద భారత ప్లేట్ కలయిక వల్ల ఘర్షణ సంభవించే ప్రమాద జోన్ 5లో ఇది ఉన్నది. సెప్టెంబర్ 2న కూడా అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
EQ of M: 5.8, On: 14/09/2025 16:41:50 IST, Lat: 26.78 N, Long: 92.33 E, Depth: 5 Km, Location: Udalguri, Assam.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/fGgMfM05Lb— National Center for Seismology (@NCS_Earthquake) September 14, 2025
Also Read:
Asaduddin Owaisi | 26 మంది ప్రాణాల కంటే డబ్బు విలువైనదా?.. భారత్, పాక్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఆగ్రహం
Watch: టోల్ ప్లాజా వద్ద పేలిన లారీ టైరు.. తర్వాత ఏం జరిగిందంటే?